మా సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిం చారు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవు తోంది. ఈ సందర్భంగా ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ పేరుతో మేకర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత వెంకట సతీశ్ కిలారు మాట్లాడుతూ.. “పెద్ది’ చిత్రం తొలిరోజే రూ.135 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇది రామ్‌చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు. అందరూ సినిమాను నమ్మి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. టికెట్ రేట్ల విషయంలో మాకు సహకరిం చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ కూడా మాట్లాడారు.






