17 March, 2026 | 4:59 PM

Breaking News

ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం   •   ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •  

ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు

03-11-2024 12:00 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘క’. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘క’ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించారని పేర్కొంటూ మూవీ టీమ్ చెబుతోంది.

ఈ మేరకు శనివారం వారు చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో హీరో కిరణ్ మాట్లాడుతూ.. ‘నన్ను గతంలో ప్రేక్షకులు పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు.

ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ నెల 8న మలయాళంలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తమిళనాట ఉన్న తెలుగు ప్రజలు తమకు షోస్ కావాలని అడుగుతున్నారు’ అని తెపారు. కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.