18 May, 2026 | 1:53 AM

ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదల్లేరు

18-05-2026 01:06 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీశ్ కిలారు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. 

-రామ్‌చరణ్ సినిమా ఇవ్వడం నా అదృష్టం. ఆయన ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడింది. -ఈ సినిమాను మేము అనుకున్న బడ్జెట్‌లో, గ్రాండ్ స్కేల్‌లో అద్భుతంగా తెరకెక్కించాం. మా జర్నీ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు చాలా కూల్‌గా జరిగింది. శ్రీలంక, పూణే, ఢిల్లీ వంటి రియల్ లొకేషన్స్‌లో కూడా షూట్ చేశాం. షూటింగ్‌లో ఎలాంటి పెద్ద సవాళ్లు ఎదురుకాలేదు. షూటింగ్ చివరి రోజు హీరో, డైరెక్టర్ అందరూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. షూటింగ్ జరిగినన్ని రోజులు నేను సెట్‌లోనే ఉండేవాడిని.

-చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. అది స్క్రీన్‌పై చూసినప్పుడే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవు తుంది. సినిమా కోసం రెండేళ్ల పాటు ప్రత్యేక ట్రైనర్‌ను పెట్టుకొని పనిచేశారు. గాయాలను లెక్క చేయకుండా ఒళ్లు హూనం చేసుకున్నారు. కంటికి కుట్లు వేసుకున్న మరుసటి రోజే షూటింగ్‌కు వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన శరీరం సహకరించకపో యినా, ఫిజియో థెరపీ చేయించుకుని వెంటనే షూట్‌కు సిద్ధమయ్యేవారు. బిజినెస్ మొత్తం పూర్తయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉన్నాం.

-ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు వెంటనే సినిమా చూడాలని అను కుంటారు. టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. అంత ఫుల్ ప్యాక్డ్‌గా ఉంటుంది సినిమా. ‘పెద్ది’లో -సుకుమార్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. కథ విషయంలో ముందుగా ఆయన గురువు సుకుమార్‌తో షేర్ చేసుకుని ఉండొచ్చునేమో కానీ షూటింగ్ మొదలైన తర్వాత మొత్తం బుచ్చిబాబు చూసుకున్నారు.