13 April, 2026 | 2:30 AM

శ్రీ చైతన్య విద్యాసంస్థల విజయకేతనం

13-04-2026 12:49 AM

కరీంనగర్, ఏప్రిల్12(విజయక్రాంతి):ఆదివారం ప్రకటించినబడిన ఇంటర్-2026 ప్రథమ మరియు ద్వితీయ ఫలితాలలో  కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మ్రోగించారు.  శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి  అత్యు త్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బొ కెలతో సత్కరించారు.

విద్యార్ధులు ప్రణాళిక బద్దంగా అభ్యసించి గణనీయమైన మార్కు లు సాధించి మెరుగైన ఫలితాలను రాబట్టా రు. అంకిత భావంతో కృషి చేస్తే... సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ప్రతి భావంతుల వివరాలు రెండవ సంవత్సర ఫలితాలలో యం.పి.సి నందు 995 (బి. శశికుమార్, కె. మైత్రి, యు. చారు హాసిని) 994(యం. సాత్విక, శ్రీ. శ్రీనిత్య, డి. ప్రవళిక) 990 కి పైగా (20 విద్యార్థులకు) బై.పి.సి నందు 994( బి. లహరి, ఓ. శినివాసన్) 994(సి.హెచ్. కార్తిక్) 980 కి పైగా (18విద్యార్థులకు), యం.ఇ.సి నందు 974 పి వల్లవి రాజయ్య. సి.ఇ.సి నందు 984 అం జలి కిలేరి మార్కులు సాధించిరు.

మొదటి సంవత్సర ఫలితాలలో యం.పి.సి. నందు బి. ప్రశాంత్ గౌడ్ 468, 467(జి. అక్షర, ఇ. అక్షయ, కె. గిపి, యం. కళ్యాణి), 466(10 విద్యార్థులకు), 461 కు పైగా (44 విద్యార్థులకు) బి.పి.సి నందు 438 (డి. మెఘన, ఎ. సిద్ధార్) 437-(డి. మనోజ్ఞ), 431 పైగా (8 విద్యార్థులకు) యం.ఈ.సి నందు పి. లిఖిత గుప్త- 494, సి.ఈ.సి నందు సి.హెచ్. శివాత్మిక రెడ్డి 490 మార్కులు సాధించారు.

నాణ్యమైన కార్పోరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని తెలిపారు. శ్రీ చైతన్య గ్రూఫ్ అఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆహ్లదకరమైన వాతావ రణంలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నామని తెలిపారు. పటిష్టమైన ప్రణాళికలతో పాటు నిరంతర పర్యవేక్షణ, అధ్యాపకుల అత్యుత్తమ బోధన విద్యార్ధులు పట్టుదల, అహర్నిషల కృషి ఫలితంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు మరియు అత్యుత్తమ ఫలితాలతో విజయం సాధించారని తెలిపారు.