13 April, 2026 | 2:13 AM

ఆర్టిజన్, అన్మాండ్, మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

13-04-2026 12:51 AM

సీఐటీయూ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్

కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఆర్టిజన్ కార్మికులతో చర్చించి తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, ముదాం అరుణ్ డిమాండ్ చేశారు. ఆదివారం  జిల్లా కేంద్రంలోని ఎస్ ఈ కార్యాలయం ముందు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీజన్ కార్మికులను కలిసి మద్దతు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని, విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని, స్పాట్ బిల్లర్లకు జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు అందజేస్తామని తదితర అనేక రకాల హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇంకా సమస్యల పరిష్కరించకుండా ఆర్టిజన్లతో వెట్టి చాకిరీ చేయించడం సరైనది కాదన్నారు.

కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మె గురించి,వారిని పిలిచి మాట్లాడకుండా సమస్య పరిష్కరించకుండా పర్మినెంట్ ఉద్యోగులతో పనులు చేయిస్తూ సమ్మె నిర్వీర్యానికి ప్రయత్నించడం అన్యాయం అన్నారు. తక్షణమే ఆర్టిజన్ల ను చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరించాలని వారి సమస్యల పరిష్కారం అయ్యేదాకా వారికి అండగా సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.వారు చేసే కార్యక్రమాలలో భాగస్వామ్యమవుతామని తెలిపారు. సమ్మెలో సునీల్ నాంపల్లి రవి, ప్రతాప్, రాజు, స్వామి, కిరణ్ ,రఘు, సాగర్ సిఐటియు నాయకులు ఆర్టిజన్, అన్మాండ్,  మీటర్ రీడింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.