04-12-2025 01:54:06 AM
పంచాయతీ పోరులో యువత
మూడో విడత నామినేషన్లకు శ్రీకారం
రిజర్వు స్థానాల్లో ఉపసర్పంచ్ పదవులపై నజర్
మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిపో యింది. దీనితో పోటీ అనివార్యమైన చోట తొలివిడత పంచాయతీ ఎన్నికల సమరం ప ల్లెల్లో ప్రారంభించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 70 నుంచి 80 శాతం 40 ఏళ్లలోపు వయసుగల వారే పంచాయతీ ఎ న్నికల్లో పోటీకి దిగినట్లు ప్రచారం సాగుతోంది.
గతంలో పంచాయతీ ఎన్నికలు అం టే ఊరిలో కాస్త పేరు ఉన్న, పెద్ద వయసు గలవారు పోటీలో నిలిచేవారని, ఇప్పుడు ఆ ట్రెండు పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. ఎక్కువ శాతం యువత పంచాయతీ ఎన్నికల్లో లేనివిధంగా ఎన్నికల బరిలో దిగినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు.
మూడో విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 గ్రామపంచాయతీ సర్పంచ్ ప దవులకు, 4,896 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 5 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారడంతో పలుచోట్ల కేటాయించిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఆ కేటగిరీకి సం బంధించిన ఓటర్లు లేకపోవడంతో కొన్ని చో ట్ల ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉన్న ఓటర్ల సంఖ్యకు గ్రా మంలో కేటాయించిన పదవులకు తగ్గట్టుగా ఉండటంతో అనివార్యంగా వారికి పదవినియోగం పట్టిందని చెబుతున్నారు.
ఉప సర్పంచ్ పదవులపై నజర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామాల స ర్పంచ్ పదవుల కోసం చాలాకాలంగా ఆశ లు పెట్టుకున్న ఆశావాహులకు రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఉప సర్పంచ్ పదవులపై కన్నేసినట్లు ప్రచారం సాగుతోంది. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పదవితో పాటు ఉపసర్పంచ్ సంతకం కూడా కీలక కావడంతో కనీసం ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకొని గ్రామాల్లో చక్రం తిప్పడానికి రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
సర్పంచ్ పదవుల్లో తమకు అణువు గా ఉండే వారిని రిజర్వేషన్ కేటగిరి కి చెం దిన వారిని ఎంపిక చేసుకొని సర్పంచ్ గా గెలిపించి, తాము వార్డు సభ్యుడుగా ఎన్నికై ఉప సర్పంచ్ పదవితో ఐదేళ్లపాటు గ్రామం లో రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
గ్రామాల్లో ఊపందుకున్నప్రచారం
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో పోటి అనివార్యమైన చోట సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బరి లో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. తమకు కేటాయించిన గుర్తులతో ఇం టింటికి తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. ముందుగా తమకు అనుకూలమైన వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇంటింటికి తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులతో కూడిన డోర్ పోస్టర్లను అంటిస్తూ, తప్పకుండా గుర్తు గుర్తుంచుకొని ఓటు వేసి గెలిపించాలంటూ వేడుకుంటున్నారు.