04-12-2025 01:56:07 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో కేటీఆర్ నివాసంలో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ బుధవారం సమావేశమయ్యారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ర్టం సాధించిన ప్రగతి, అభివృద్ధి గురించి చర్చించుకున్నారు. భవిష్యత్తులో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారంపై చర్చలు జరిగినట్లు కేటీఆర్ తెలిపారు.