23 August, 2026 | 1:36 AM

బీసీఐ చైర్మన్ రాజీనామా చేయాలి

23-08-2026 12:50 AM
  1.    15 రోజుల్లో పదవి నుంచి వైదొలగాలి
  2. కౌన్సిల్ ట్రస్ట్ పరిధిలో రూ.150 కోట్లు దారి మళ్లాయి
  3. చైర్మన్ సొంత సంస్థలా కౌన్సిల్‌ను వాడుకుంటున్నారు
  4. కౌన్సిల్ కో- చైర్మన్ వైఆర్ సదాశివరెడ్డి సంచలన ఆరోపణలు
  5. అక్రమాలపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు ౨౨: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా రూ.150 కోట్ల మేర కౌన్సిల్ నిధులు మళ్లించారని, అందుకు బాధ్యత వహిస్తూ ఆయన 15 రోజుల్లో తన పదవికి రాజీనా మా చేయాలని కౌన్సిల్ కో-చైర్మన్, సీనియ ర్ అడ్వొకేట్ వైఆర్ సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. న్యాయకళాశాలల అనుమతులు, పు నరుద్ధరణల కోసం చైర్మన్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

అవినీతి, అక్రమాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ను కోరారు. బుధవారం ఈ మేరకు ఆయ న బీసీఐని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశా రు. కౌన్సిల్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధమైన సంస్థ అని, అలాంటి కౌన్సిల్ ను మనన్‌కుమార్ సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కౌన్సిల్ పరిధి లో ఉన్న పాత ట్రస్ట్‌ను పక్కన పెట్టి, మనన్‌కుమార్ మిశ్రా 2020లో ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ పేరిట కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేశారని, ఈ కొత్త ట్రస్ట్‌ను తన అవసరాల నిమిత్తం వాడుకుంటున్నారని ఆరోపించా రు.

కౌన్సిల్‌కు చెందిన రూ.150 కోట్ల నిధులను ట్రస్టుకు అక్రమంగా మళ్లించారని సం చలన ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన నిధులను ఒక ప్రైవేట్ ట్రస్ట్‌కు బదిలీ చేసినందుకు ఆయన పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. నిధుల మళ్లింపును కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించినా, మనన్‌కుమార్ వినకుండా తీర్మానాన్ని ఆమోదించుకున్నారని వెల్లడించారు. నిబంధనలను పక్కనపెట్టి చైర్మన్ తన బంధువులకు, తనకు తెలిసిన వారికి కౌన్సిల్‌లో ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు.

ఎ లాంటి ప్రకటన లేదా మెరిట్ జాబి తా లే కుండానే నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. కౌన్సిల్ ప్రస్తుతం అక్రమాల పుట్టలా తయారైందని, కౌన్సిల్ ఇప్పుడు ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి చిరునామా గా మారిం దని పేర్కొన్నారు. నిధులు, నియామకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు: మనన్‌కుమార్ మిశ్రా

తనపై వచ్చిన ఆరోపణలపై బీసీఐ చైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో ఎలాం టి వాస్తవం లేదని వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆధారా లు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఒకవేళ తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే, తానే స్వచ్ఛందంగా పద వి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. బీసీఐ పరిధిలోని మూడింట రెండు వంతు ల కంటే ఎక్కువ మంది సభ్యులు తనకు మద్దతుగా ఉన్నారని, కొత్త ట్రస్ట్ వ్యవహారాలన్నీ అత్యంత పారదర్శకంగా జరుగుతున్నా యని వివరించారు. 

ట్రస్ట్ ఖాతాలన్నింటికీ యేటా ఆడిటింగ్ జరుగుతున్నదని, ఆ నివేదికలను బడ్జెట్‌లో పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేశామని, అలాగే.. చైర్మన్ పదవీకాలంపై చట్టంలో ఎలాంటి కాల పరిమితి లేదని తేల్చిచెప్పారు. చట్ట ప్రకారమే తాను వరుసగా ఆరుసార్లు ఏకగ్రీవంగా ఎన్నిక అ య్యాయని వివరించారు. తాను పదవి నుం చి తప్పుకొనే సమస్యే లేదని కుండబద్దలు కొట్టారు.

సుప్రీం కోర్టులోనూ పిటిషన్

మనన్‌కుమార్ మిశ్రా సుదీర్ఘ కాలం నుం చి బీసీఐ చైర్మన్‌గా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ యోగమాయ అనే అడ్వొకేట్ గతంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. కౌన్సిల్ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమేనని, కానీ.. మనన్‌కుమార్ మిశ్రా దశాబ్ద కాలానికి పైగా చైర్మన్‌గా కొనసాగుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.