కల్తీపై ఎఫ్‌డీఏ ఉక్కుపాదం
- మహారాష్ట్ర వ్యాప్తంగా దాడులు
- జాబితాలో మెక్ డొనాల్డ్స్ కూడా
- 13 హోటళ్ల లైసెన్సులు రద్దు, 71 హోటళ్లకు నోటీసులు జారీ
ముంబై, ఆగస్టు 22: పరిశుభ్రత పాటించ ని, కల్తీ ఆహారం వడ్డిస్తున్న హోటళ్లపై మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలనా సంస్థ (ఎఫ్ డీఏ) ఉక్కుపాదం మోపింది. ముంబైతో స హా రాష్ట్రవ్యాప్తంగా 89 హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా, 71 హోటళ్లకు నోటీసులు జా రీ చేసింది. 13 హోటళ్ల ఆహార లైసెన్సులను రద్దు చేసింది. రద్దున వాటిలో ప్రముఖ ఆహా ర సంస్థ ‘మెక్ డొనాల్డ్స్’ కూడా ఉండడం గమనార్హం. దాడుల వివరాలను మీడియా కు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే శనివారం వివరించారు.
ఆహార కల్తీ పై మహారాష్ట్ర, ముంబైలో గత రెండు, మూ డు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. తనిఖీల్లో పలు హోటళ్లలో అ పరిశు భ్రత వాతావరణం, పాలు, చీజ్ లాంటి ఉ త్పత్తుల్లో కల్తీని గుర్తించామన్నారు. కొలా బా, నారిమన్‌పాయింట్, మలాడ్ వెస్ట్, శాం తాక్రూజ్ వెస్ట్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీల్లో ఈ లోపాలు బయట పడి నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,348 కిలో ల పాలపొడి, 902 లీటర్ల కల్తీ పాలు, 1,450 కిలోల పాల ఉత్పత్తులు, నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామన్నా రు. 12 ఎఫ్‌ఐఆర్లు నమోదు చేయగా, 18 మందిని అరె స్టు చేశామని 13 హోటళ్ల ఆ హార లైసెన్సులను రద్దు చే యగా, 12 హోటళ్లను సీజ్ చేశామని చెప్పారు.
71 హో టళ్లకు పరిశుభత్ర మె రుగుపర్చుకోవాలని నోటీసులు జారీ చే శామని వివరించారు. మెక్ డొనాల్డ్స్, బాం బే ప్రెసిడెన్సీ రేడి యో క్లబ్ వంటి ప్ర ముఖ హోటళ్ల లైసెన్సులను కూడా రద్దు చేసినట్లు కమిషనర్ తుకా రం ముండే స్పష్టం చేశారు. మే నెలలో బాధ్యతలు స్వీకరించిన తుకారాం ముండే అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుం చి హోటళ్లపై ఉక్కుపాదం మోపుతుండడం పై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది.






