2 June, 2026 | 2:43 AM

బాధ్యతకు ఆరంభం ఆవిర్భావం

02-06-2026 12:00 AM

కాలగిరి శ్రీనివాస్ రెడ్డి :

* జూన్ 2... తెలంగాణ ప్రజల కు ఇది కేవలం ఒక పండుగ రోజు కాదు, ఇది ఒక జాతి కన్నీళ్లకు వచ్చిన సమాధా నం. ఒక ప్రాంతం ఎదుర్కొ న్న అవమానాలకు వచ్చిన ప్రతిస్పందన. ఒక భాష, ఒక సంస్కతి, ఒక ఆత్మగౌరవం తన సొంత చిరునామా పొందిన చారిత్రక ఘట్టం. 2014 జూన్ 2న భారతదేశపు 29వ రాష్ర్టంగా తెలంగాణ అవతరించింది. కానీ, ఆ రోజు ఒక్కసారిగా రాలేదు. దాని వెనుక దాదాపు ఆరు దశాబ్దా ల బాధ, నిరాశ, వివక్ష, ఉద్యమాలు, రక్తపాతం, వేలాది కుటుంబాల త్యాగాలు ఉన్నాయి.

నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ ఉద్యమా న్ని ఒక రాజకీయ పోరాటంగా చూడటమంటే చరిత్రను అవమానించడమే. అది నీళ్లు, నిధులు, నియా మకాలు, భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం జరిగిన మహాయుద్ధం. 1956లో పె ద్ద మనుషుల ఒప్పందం హా మీలతో తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చి న హామీలన్ని అటకెక్కాయి.

అప్పటినుంచి తెలంగాణ ప్రజల్లో ఒక ప్రశ్న పెరుగుతూ వచ్చింది ---- ‘మన నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? మన నిధులు ఎవరి అభివృద్ధికి ఖర్చవుతున్నాయి? మన ఉద్యోగాలు ఎవరు తీసుకుంటున్నారు?’. తెలంగాణ గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులు ఈ నేల జీవనాడులు. కానీ, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల ప్రయోజనాలు ఎక్కువగా ఇతర ప్రాంతా లకు చేరాయి. కృష్ణా నీళ్ల పంపిణీలో తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరిగింది.

గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవగా, ఆంధ్రలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటం తెలంగాణ రైతుల్లో ఆవేదనను పెంచింది. ‘నది మా నేల మీదుగా ప్రవహిస్తుంది. కానీ, నీరు మా పొలాలకు చేరదు’ అనే బాధ వేలాది రైతుల గొంతుకగా మారింది. ఇదే ఆగ్రహం తరువాత ఉద్యమ నినాదాల్లో ప్రతిధ్వనించింది. నీళ్లతో పాటు నిధుల అంశం కూడా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువైంది.

హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భాగాన్ని అందించేవి. కానీ, ఆ ఆదాయానికి తగిన స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి వ్యయం జరగడం లేదనే వాదన బలపడింది. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, విద్యాసంస్థల స్థాపనలో తెలంగాణ వెనుకబడిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది.

ఉద్యోగాల విషయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు సరైన అవకాశాలు దక్కడం లేదనే భావన విద్యార్థి ఉద్యమాలకు ఇంధనంగా మారింది. 1969 తొలి దశ ఉద్య మం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఆ ఉద్య మం చివరికి రక్తపాతానికి దారితీసింది. వందలాది మం ది విద్యార్థులు, యువకులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ చరిత్రలో అది ఒక చెరగని గా యం. అయితే తెలంగాణ ప్రజల గుండెల్లో అత్యంత లోతైన గాయం ఆర్థిక వివక్ష వల్ల కాదు, వారి భాష, యాస, సంస్కృతిని అవమానించడం వల్ల అయ్యింది.

దశాబ్దాలపాటు తెలంగాణ యాసను హాస్యానికి పరిమితం చేశారు. మాటలను వెక్కిరించారు. సినిమాల్లో తెలంగాణ పాత్ర అంటే అమాయకుడు, వెనుకబడినవా డు, హాస్యపాత్ర అనే భావనను బలపరిచారు. తెలంగాణ యువకుడు తన యాసలో మాట్లాడితే నవ్వుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, అదే యాసను తెలంగాణ ప్రజ లు తమ ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్నారు. గద్దర్ వంటి ప్రజాకవులు, జానపద కళాకారు లు తెలంగాణ భాషను పోరాటగీతంగా మార్చారు. గ్రామాల్లో, విశ్వవిద్యాలయాల్లో, ఉద్యమ వేదికలపై తెలంగాణ భాష గర్జించింది.

దశాబ్దాలపాటు అణగారిన తెలంగాణ ఆకాంక్షకు 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో కొత్త ఊపిరి వచ్చిం ది. శ్రీకాంత చారి ఆత్మాహుతి తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. కానిస్టేబుల్ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య తెలంగాణ కోసం మరణాన్ని ఆహ్వానించారు. వారి త్యాగాలు లక్షలాది మందిలో ఆవేదనను, ఆవేశాన్ని రగిలించాయి. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది వరకు ప్రాణత్యాగం చేశారని వివిధ అంచనాలు చెబు తున్నాయి. ప్రతి అమరుడి వెనుక ఒక కుటుంబం ఉంది. ప్రతి కుటుంబం వెనుక ఒక విషాద గాథ ఉంది.

తెలంగాణ అమరవీరుల స్మారకం కేవలం ఒక నిర్మా ణం కాదు, అది వేలాది త్యాగాలకు ప్రతీక. బతుకమ్మ కేవలం పండుగ కాదు, అది తెలంగాణ సంస్కృతి తిరిగి వికసించిన చిహ్నం. తెలం గాణ యాస మాట్లాడే భాష కాదు. అది ఒకప్పుడు అణచివేతకు గురైన సమాజం సాధించిన విజయానికి నిదర్శనం. అయితే తెలంగాణ ఆవిర్భావం ఒక ముగింపు కాదు. అది ఒక బాధ్యతకు ఆరంభం. అమరవీరులు కలలు కన్న తెలంగాణ అంటే కేవ లం భౌగోళిక సరిహద్దులు కాదు.

ప్రతి గ్రామానికి నీరు చేరే తెలంగాణ. ప్రతి యువకుడికి అవకాశం దొరికే తెలంగాణ. ప్రతి రైతు గౌరవంగా బతికే తెలంగాణ. ప్రతి పౌరుడు తన యాసను గర్వంగా మాట్లాడే తెలంగాణ. జూన్ 2 సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్క టే.. ఈ రాష్ర్టం రాజకీయ నాయకుల ప్రసంగాలతో రాలే దు. ఇది వేలాది అమరుల రక్తంతో నిర్మింతమైంది. ఈ రాష్ర్టం ఉద్యమాల వల్ల వచ్చింది. ఈ రాష్ర్టం ఆత్మగౌరవం వల్ల నిలిచింది. ఈ రాష్ర్టం భవిష్యత్తు కూడా అదే ఆత్మగౌరవం మీద ఆధారపడి ఉంటుంది.

వ్యాసకర్త: 9010128884