17 April, 2026 | 5:46 AM

ఘనంగా వాసవి మాత వార్షికోత్సవ వేడుకలు

11-06-2025 01:18 AM

చేగుంట, జూన్ 10 : చేగుంట పట్టణ కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు తోడుపునూరి నగేష్ ఆధ్వర్యంలో ఘనంగా  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి,108 కలశముల ఊరేగింపుతో   స్థానిక హనుమాన్ దేవాలయం నుండి ప్రధాన వీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో  ఆర్యవైశ్య కమిటీ సభ్యులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. దేవాలయంలో 150 లీటర్ల వివిధ రకాల పంచామృతా లతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నగేష్ గుప్తా, గౌరవ అధ్యక్షులు  అనమయ్య గుప్తా, జనరల్ సెక్రటరీ అయిత రఘురాములు, బాలేశం గుప్తా, నాగభూషణం గుప్తా,  అయిత పరంజ్యోతి, మంచికట్ల శ్రీనివాస్, మహిళాలు పాల్గొన్నారు.