కరెంట్ షాక్‌తో తల్లికొడుకు మృతి
16-05-2024 01:04 PM
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో తల్లికొడుకు మృతి చెందారు. బట్టలు ఆరేయడానికి వెళ్లి తల్లి మణెమ్మ (45) కరెంట్ షాక్‌కు గురైనంది. తల్లిని కాపాడడానికి వెళ్లిన కొడుకు ప్రసాద్, కూతురు శ్రీలతకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తల్లికొడుకు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కూతురు శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.




