తెలంగాణపై విషం కక్కుతున్న బీజేపీ
18-04-2026 12:00 AM
ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదని, విషం గక్కుతోందని ప్ర భుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ సూర్య తెలంగాణను అవమానించి, అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. శుక్రవారం వేముల సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేం ద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ కో సం రాజీనామా చేయకుండా పారిపోయాడన్నారు. తెలంగాణ ఏర్పాటును అ వమానిస్తే ఉద్యమాలు, అమరుల త్యా గాలను అవమానించినట్లేనని అన్నారు.






