5 May, 2026 | 4:12 AM

బీజేపీ 100 సీట్లు లూటీ చేసింది!

05-05-2026 01:34 AM
  1. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా కుట్రపన్నారు
  2. ఇది అనైతిక విజయం.. ప్రజలు మా వైపే నిలుస్తారు
  3. సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు

కోల్‌కతా, మే ౪: తృణమూల్ పార్టీ ఖాతాలో పడాల్సిన ౧౦౦ సీట్లను బీజేపీ లూటీ చేసిందని సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా సోమవా రం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీ కమిషన్‌గా మారిందని ఆరోపించా రు. బీజేపీ గెలుపు అనైతిక విజయమేనని, నైతిక విజయం కాబోదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

కేంద్ర బలగా ల సాయంతో ప్రధాని మోదీ, హోంమం త్రి అమిత్‌షా సీట్ల లూటీకి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలపై తాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో నూ తనను బీజేపీ నేతలు, కేంద్ర బలగా లు చుట్టుముట్టి ఇబ్బందులకు గురిచేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఫలితాలు తాత్కాలికమేనని, ప్రజల మద్ద తు తృణమూల్ పార్టీకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో టీఎంసీ మళ్లీ బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లుగా అధికారం లో ఉన్న తమను దెబ్బతీసేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కిందని ధ్వజమెత్తారు. తమ పోరాటం ఇక్కడితో ఆగదని, ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించారు.