14 August, 2026 | 1:07 AM

పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలి

14-08-2026 12:31 AM

అదనపు కలెక్టర్ కిరణ్మయి

ఆమనగల్లు, ఆగస్టు 13 (విజయక్రాంతి): పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మ యి గురువారం పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.పర్యటనలో భా గంగా ఆమె ఆమనగల్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెప్మా ఆధ్వర్యంలో ఉచిత యూనిఫామ్ లు పంపిణీ చేసి, బాగా చదువుకోవాలని సూచించారు.

అక్కడి నుంచి చె రువులో నీటి లీకేజీలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. ’అమృత్ జల్’ మంచినీటి ట్యాంకు నిర్మాణాన్ని త్వర గా పూర్తి చేసి, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీ రు అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గీత, సిబ్బంది పాల్గొన్నారు.