29-09-2025 12:39:47 AM
అలంపూర్ సెప్టెంబర్ 28: ప్రమాదవశా త్తు ఒళ్ళు కాల్చుకున్న చిన్నారి లడ్డమ్మ వయ సు (6) సంఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అలంపూర్ మండల పరిధిలోని లింగనవాయి గ్రామానికి చెందిన అంజనమ్మ బీచుపల్లి ల కూతురు లడ్డమ్మ నాలుగు రోజుల కిందట ప్రమాదవశాత్తు శరీరం కాలింది.
కానీ పాప కు చికిత్స చేయకుండా తల్లిదండ్రులు ఇంటిలోనే పెట్టుకోవడంతో పాప శరీరం మొత్తం చీము పెట్టి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులను మందలించి చికిత్స నిమిత్తం అల్లంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది కర్నూల్ కు రిఫర్ చేయడం తో అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పాప లడ్డమ్మను తీసుకు వెళ్లినట్లు గ్రామస్తులుతెలియజేశారు.