calender_icon.png 19 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్ హామీ బోగస్!

19-10-2025 12:58:37 AM

  1. వాటాల పంచాయితీల్లో కాంగ్రెస్ దొంగలు
  2. ‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని రైతాంగానికి సన్న వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ హామీ బోగస్ అయ్యిందని, ధాన్యం కొనుగోళ్లకు దిక్కేలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు.  శనివారం ‘ఎక్స్’వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదని విమర్శించారు.  అకాల వర్షాలకు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతూ.. వరదకు కొట్టుకుపోతుంటే రైతన్నలు అరిగోస పడుతున్నారని అన్నా రు. అయినా, రైతులను పట్టించుకోకుం డా కాంగ్రెస్ దొంగలేమో ‘నీకు ఎంత, నా కు ఎంత’ అనే వాటాల పంచాయితీల్లో కొట్టుకుచస్తున్నారని మండిపడ్డారు.