హత్య కేసులో నిందితులకు రిమాండ్
చార్మినార్, జూన్ 25 : ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టు కొని వేధిస్తున్న యువకుడిని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌నగర్‌కు చెందిన జాకీర్ అలీ (29) వృత్తిరీత్యా డ్రైవర్. ఐదేండ్ల క్రితం అచ్చిరెడ్డినగర్‌కు చెందిన షాహిన్‌బేగంతో ఓ ల్యాండ్ విషయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే, అప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్న షాహిన్‌బేగంతో జాకీర్ అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా షాహిన్ ఇద్దరు కూతుర్లపై కూడా జాకీర్ కన్నేశాడు.
ఈ నెల 21న షాహిన్‌బేగం ఇంటికి వచ్చిన జాకీర్‌కు, ఆమెకు మధ్య గొడవ జరిగింది. దీంతో షాహిన్‌బేగం తన సోదరుడు మహ్మద్ షఫీకి విషయం చెప్పడంతో హుటహుటిన ఇంటికి వచ్చిన షఫీ జాకీర్‌తో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో జాకీర్ తలపై బలంగా కొట్టడంతో జాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు.






