21-01-2026 12:00:00 AM
మిర్యాలగూడ. జనవరి 20 (విజయక్రాంతి): అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ రాయితీపథకాన్ని ప్రవేశపెట్టిందని, దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ ) అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన రాయితీ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజికపరంగా కేటాయించిన రాయితీ యాంత్రీకరణ పరికరాలను ప్రభుత్వం రైతులకు అందిస్తుందని, వాటిని వినియోగించు కొని సమయం డబ్బు ఆదాతో పాటు వ్యవసాయ దిగుడులు, భూ సంరక్షణకు చేపట్టవచ్చన్నారు. ఐదు బ్యాలర్లు, 8 కల్టివేటర్స్, 4 రోటోవేటర్స్, 24 స్ప్రేయర్లను అర్హులైన రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఇంచార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు ధీరావత్ సైదానాయక్, వ్యవసాయ అధికారులు కిషోర్ నాయక్, సరిత, శివరాం, వ్యవసాయ విస్తరణ అధికారులు అజ్మీర సైదులు నాయక్, షఫీ, రమేష్, ఆఫ్రీన్, శిరీష, ప్రియాంక, పార్వతి, సర్పంచులు జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, బెజ్జం సాయి, ఇంజం నర్సిరెడ్డి, నాయకులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, రవితేజ, సూర్య నాయక్ తదితరులున్నారు.