3 September, 2026 | 6:20 PM

ఫేస్‌బుక్‌లో తల్వార్ ఫొటో అప్‌లోడ్‌

10-12-2024 | 02:04am

యువకుడిని అదుపులో తీసుకున్న పోలీసులు

చార్మినార్, డిసెంబర్ 9: తల్వార్‌తో సంచరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తల్వార్‌తో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఇదే ప్రాంతానికి చెందిన జీ అజయ్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో రూ.1,600లకు ఓ తల్వార్‌ను కొనుగోలు చేశాడు. దాన్ని స్నేహితుల బర్త్ డే పార్టీల్లో కేక్ కట్ చేసేందుకు ఉపయోగిస్తున్నాడు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేవాడు. సోమవారం కూడా అతడు తల్వార్‌తో ఛత్రినాక ప్రాంతంలో సంచరిస్తుండగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.