15-07-2025 12:00:00 AM
- రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు
- ఇబ్బంది పడుతున్న వాహనదారులు
మందమర్రి, జూలై 14 : పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్లు చూపెట్టిన శ్రద్ధ పనులు పూర్తయిన తరువాత నిర్వహణలో చూపెట్టడం లేదనే విమ ర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని 3వ వార్డులో డ్రైనేజీలు శిధిలావస్థకు చేరి మురుగు నీరు నిలువ ఉండి దుర్గంధం వెదజల్లుతుందని వార్డ్ ప్రజలు ఎమ్మెల్యే, మున్సి పల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నూతనంగా డ్రైనేజీ నిర్మాణం పనులను అధికారు లు మంజూరు చేశారు.
ఇటీవల కాలువ నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పాత కాలువ శిధిలాలను తొలగించి రోడ్డు పక్కన పడేసి నూతన కాలువ పనులు పూర్తి చేశారు. కాలువ పనులు పూర్తి చేసినప్పటికీ పాత కాలువకు సంబంధించిన కాంక్రీట్ శిధిలాలను రోడ్డుపై నుంచి తొలగించకపో వడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువ శిధిలాల మూలంగా కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో శిధిలమైన బండరాళ్ళు కనిపించక వాటికి తగిలి పలువురు కాలనీ వాసులు గాయలపాలు అవుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
వాహనదారుల ఇబ్బందులు
ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళ బండ రాళ్ళు కనిపించక పెద్దపెద్ద బండరాళ్లకు తగిలి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నామని పలువురు వాహన దారులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా చిన్నారులు ఆడుకొంటూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభంలో అధికారులు చూపెట్టిన శ్రద్ధ, పనులు పూర్తయిన అంతరం చూపెట్టక పోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని సంబంధిత అధికారుల తీరుపై ప్రజలు మండి పడుతున్నారు.
ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు...
ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు కాలువలు శుభ్రం చేయక పోవడంతో దుర్గం ధం వెదజల్లి దోమలకు నిలయంగా నిలిచాయని, అంతే కాకుండా కాలువ చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి విష కీటకాలకు నిలయంగా మారాయని పులువురు కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం విష జ్వరాలు ప్రబలే ప్రమాదము న్నందున అధికారులు స్పందించి పారిశుద్ధం మెరుగు పరచడంతో పాటు పిచ్చి మొక్కలు తొలిగించి ఇబ్బందులు తీర్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ఇబ్బందులు తొలగించాలి -
వార్డులో పారిశుద్ధ్యం పనులు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. మురుగు కాలువలలో పిచ్చి మొక్కలు పెరిగి విష కీటకాలకు నిలయంగా మారాయి. అంతే కాకుం డా నూతన డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా శిధిలమైన పాత కాలువ బండరాళ్లను తొలగించక పోవడంతో ద్విచక్ర వాహనదారులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
దూలం శ్రీనివాస్, మందమర్రి