8 August, 2026 | 2:08 AM

రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి

08-08-2026 01:05 AM
  1. బీసీ కులగణన చేయాలి
  2. దేశవ్యాప్త బీసీ ఉద్యమానికి బాసటగా కాంగ్రెస్
  3. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్
  4. రాష్ట్రాలను ఏకం చేస్తూ దేశాన్ని కదిలించాలి 
  5. వీహెచ్, ఈటల, మధుసూదనాచారి 
  6. బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం జాజుల శ్రీనివాస్‌గౌడ్

బెంగళూరు, ఆగస్టు 7: దేశంలో కులగణ న జరిపి, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాల ని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉం టుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్  దేశంలో అధికారంలోకి రాగానే బీసీల డిమాండ్లను నెరవేరుస్తామని డీకే వెల్లడించారు. బీసీలు ఐక్యతతో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని, బీసీల సాధికారతకు రాజకీయ పార్టీల కతీతంగా ఏకంకావాలని కర్ణాటక పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్ తెలిపారు.

దేశవ్యాప్తంగా బీసీ వాదం రోజురోజుకూ బల పడుతోందని, రాష్ట్రాలను ఏకం చేస్తూ దేశా న్ని కదిలించాలని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో ఉన్న జ్ఞాన జ్యోతి ఆధ్వర్యంలో ఓబీసీ జాతీయ 11వ మహాసభ  వైభవంగా జరిగింది. దేశం నలువైపుల నుంచి వేలాదిమంది ఓబీసీ ప్రతిని ధులు తరలివచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మహాసభ కు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ పవన్ రావ్ తైవాడే అధ్యక్షత వహించగా, కేసి న శంకర్రావు సమన్వయం చేశారు.  మహాసభను సీఎం డీకే శివ కుమార్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కాపాడుతుందన్నారు. 1931 బీసీ కులగణన బ్రిటిష్ కాలంలో జరిగిందని, మళ్లీ నేటి వర కు దేశంలో జరగలేదని స్పష్టం చేశారు.

బీసీకులగణన దేశవ్యాప్తంగా జరిగితేనే అన్ని రం గాల్లో దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు దక్కుతాయన్నారు. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ చెప్పారని సీఎం గుర్తుచేశారు. కేంద్రం జాతీయ గణనలో బీసీ కులగణన చేసి, రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘బ్యాక్ వార్డ్ క్లాస్‌కు నేను బ్యాక్ బోన్‌గా ఉంటాను. బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. ప్రభుత్వ సలహాదారు వీ హెచ్, ఎం పీ ఈటల రాజేందర్, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణలో బీసీల రాజకీయ అధికారమే లక్ష్యం గా పనిచేస్తామన్నారు.

జాజుల శ్రీనివాస్‌గౌ డ్ మాట్లాడుతూ ఢిల్లీలో బీసీల భూకంపం పుట్టించి, బీసీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వే షన్లు సాధించుకుంటామన్నారు.  జెన్‌జీ ఉద్యమ స్థాయిలోనే బీసీ ఉద్యమాన్ని  విస్తరిస్తామని స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.  బీసీల సమగ్ర ఉద్యమాల సావనీర్‌ను  విడుదల చేశారు.