22-08-2025 12:06:14 AM
అక్రమ మొరం తరలిస్తున్న రెండు జెసిబిలను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు
పెద్దపల్లి, ఆగస్టు 21(విజయ క్రాంతి): మొరం మాఫియా కు కేరాఫ్ అడ్రస్ గా తురకల మద్దికుంట గ్రా మం మారింది. గ్రామంలోని ఏనా బో ర్ల గుట్ట నుండి అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న పక్క సమాచారం అందుకున్న మైనింగ్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అధికారుల ను గమనించిన మొరం తర లించే వ్యక్తులు జెసిబిలను వదిలేసి పరారయ్యారు.
తర్వాత ఎవరి ఆ జెసిబి లు అని అధికారులు ఆరా తీశాక, గత్యంతరం లేక అక్కడకు వచ్చిన ఓనర్లు జెసిబి లో డీజిల్ లేదు అంటూ అధికారులకు జెసిబి ఓనర్ లు రెండు గంటలసేపు చుక్కలు చూపించారు. నానా తంటాలు పడి అధికా రులు చివరికి రెండు జెసిబిలను సీజ్ చేసి పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మొరం మాఫియా కు అడ్డుకట్ట వేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారి ఆర్‌ఐ వెంకటగిరి పాల్గొన్నారు.