calender_icon.png 22 August, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నా పట్టించు కోరా?

22-08-2025 12:04:13 AM

 చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి, ఆగస్టు 21 (విజయ క్రాంతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తే ఎల్లం పల్లి ప్రాజెక్టు పరధిలోని 1.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందియవచ్చని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.

గురువారం గంగాధర మండలం నారాయపూర్ రిజర్వాయర్ ను స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు, రైతులతో కలసి సందర్శించిన అనంతరం అయన మా ట్లాడుతూ,లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు పం ప్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా నీటిని ఎందుకు విడుదల చేస్తలేరో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రెండు పంపులు ఆన్ చేస్తే రిజర్వాయర్ మూడు నాలుగు రోజుల్లోనే నింపుకోవచ్చు అని, తద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, నారాయణపూర్ రిజర్వాయర్ ఈ ప్రాజెక్టుకు కీలకంగా ఉందని, దీని ద్వారా కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, జగిత్యాల జిల్లా పరిధిలోని కొడిమ్యాల, మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ, బోయినపల్లి తదితర మండలాల పరిధిలోని వేలాది ఎకరాలకు నీళ్లు అందించ వచ్చాన్నారు.

కాలువలు ద్వారా చెరువులు చెక్ డ్యామ్, కుంటలు నింపుకొని వందలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గాంధీ భవన్ ప్రెస్ మీట్ లు పెడుతూ హరీష్ రావు, కేటీఆర్ ల మీద అవాకులు, చేవాకులు పేలుతున్నాడని, గొప్పవాళ్ళని విమర్శిస్తే గొప్పవాన్ని అవుతానని భ్రమ పడుతున్నాడనిఅన్నారు.