ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
నిజాంసాగర్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల మాగీ గ్రామంలోని శివపంచాయతన అభయాంజనేయ క్షేత్ర చతుర్థ (4వ) వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం,పరివార దేవతల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.. ఈ ఉత్సవం ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో, గ్రామస్తుల సహకారంతో కన్నుల పండుగగా జరిగింది.
కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు మధుకర్ రావ్ పంతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మెన్ మనోజ్ కుమార్ , నిజాంసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, నాయకులు ప్రజా పండరి, మంద బలరాం, వెంకట్రాం రెడ్డి, జనార్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి మాగి గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






