04-12-2025 01:00:26 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘విపరీతమైన ద్వేషపూరిత ధోరణి’తో వ్యహరిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరావళి కొండలకు ఇప్పుడు ‘డెత్ వారెంట్‌పై కేంద్రప్రభుత్వం దాదాపు సంతకం’ చేసిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కార్యకాలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనియాగాంధీ ఓ జాతీయ మీడియాకు రాసిన వ్యాసంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాసంలోని కొన్ని వాక్యాలను కాంగ్రెస్ షేర్ చేసింది.
కొండలను ఖతం చేయడానికే..
ఆరావళి శ్రేణిలోని 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఏ కొండలు కూడా మైనింగ్ కు వ్యతిరేకంగా కఠిన నిబంధనలకు లోబడి ఉండవని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని, అంటే కొండలను 90శాతం ఖతం చేయడానికి అక్రమ మైనింగ్‌లు, మాఫియాలకు బహిరంగ ఆహ్వానమే అని సోనియాగాంధీ ఆగ్రహించారు.
‘గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా హర్యానా వరకు విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలు, భారత భౌగోళికంగా, చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇది థార్ ఎడారి నుంచి గంగా మైదానాల వరకు ఎడారీకరణ వ్యాప్తికి అవరోధంగా పనిచేసింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్, రణతంబోర్ వంటి గర్వించదగిన కోటలను రక్షించింది. వాయువ్య భారతదేశం అంతటా సమాజాలకు ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది’ అని సోనియా పేర్కొన్నారు.
ఏటా 34వేల వరకు మరణాలు
ఆరావళి శ్రేణి ఉత్తర చివరన గల దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెలలో వార్షిక పొగమంచు సీజన్‌ను ప్రారంభించిందని సోనియాగాంధీ ఎత్తి చూపారు. ‘విషపూరిత గాలిని పీల్చుకుంటూ లక్షలాది మంది పౌరులపై దుమ్ము, పొగ, కణ పదార్థాల పొగమంచు అలుముకుంటోందని పేర్కొన్నారు. ‘విషపు పొగమంచు మన వార్షిక దినచర్యలో భాగమైనప్పటికీ, పరిశోధనలు ఇది పూర్తిస్థాయి, నెమ్మదిగా జరిగే ప్రజారోగ్య విషాదం అని చూపిస్తున్నాయి.
ఈ కాలుష్యం వల్ల ఏటా కేవలం 10 నగరాల్లోనే మానవ మరణాల అంచనాలు 34వేల వరకు ఉన్నట్లు సోనియా తన ‘భారతదేశ పర్యావరణం దుర్భర స్థితి అనే వ్యాసంలో పేర్కొన్నారు.గత వారం వార్తల సారాంశం మరో పరిణామ విషాదాన్ని ప్రతిబింబించాయి. ఇది ఢిల్లీలో పరీక్షించిన భూగర్భ జలాల నమూనాలలో 13%- నుంచి 15% మానవ వినియోగానికి ఆమోదయోగం కావని, ఈ నీళ్లలో పరిమితికి మించి యురేనియం కలిగి ఉన్నాయని కేంద్ర భూగర్భ జల బోర్డు (సీజీడబ్ల్యూబీ) నివేదించిన సంగతి తెలిసిందే.
‘పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన నీటి నమూనాలు మరింత ఎక్కువ స్థాయిలో యురేనియం కాలుష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇది మనకు సిగ్గుచేటు. ‘రోజువారీ కార్యకలాపాల కోసం ఈ నీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ప్రభావితమైన జనాభాపై కలిగే భయానక ఆరోగ్య ప్రభావాల గురించి కేంద్రప్రభుత్వం ఆలోచించడం లేదు’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అన్నారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా క్రూరమైన వైరాన్ని పాటిస్తూ వస్తోంది. సహజ వనరుల దోపిడీని ప్రోత్సహించడానికి, దాని ధోరణిని పర్యావరణంపై పరిణామాలను నిర్లక్ష్యంగా విస్మరించడంతో ప్రత్యేక శ్రద్ధ వహించింది’ అని సోనియా చెప్పారు.
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉదాసీనత
అటవీ సంరక్షణ (సవరణ) చట్టం 2023 బడా కంపెనీలకు భూమి, ప్రాజెక్టులను దోచిపెట్టడానికి అటవీ క్లియరెన్స్ నియమాల నుంచి మినహాయించిందని, ఇతర ప్రయోజనాల కోసం మళ్లింపును సులభతరం చేసిందని ఆమె పేర్కొన్నారు. ముసాయిదా పర్యావరణ చట్టం (ఈఐఏ) నోటిఫికేషన్ 2020 ప్రజా విచారణలను నీరుగార్చడానికి, మినహాయింపులను విస్తరించడానికి, సమ్మతి నివేదికను తగ్గించడానికి ప్రయత్నించిందని సోనియా ఆరోపించారు.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నోటిఫికేషన్ 2018 భారతదేశ తీరప్రాంతాల వెంబడి నిర్మాణ నియమాలను సడలించిందన్నారు. పర్యావరణపరంగా సున్నితమైన తీరప్రాంతాలు, మత్స్యకార వర్గాల ఆవాసాలలో వాణిజ్య రియల్ ఎస్టేట్, పారిశ్రామిక కార్యకలాపాలకు డోర్లను బార్లా తెరిచిందని సోనియా ఆరోపించారు. నిబంధనలను బలహీనపరచడం కోసం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ తెలిపారు.
2024లో 65వేల వన్యప్రాణులు ఖాళీ
ప్రభుత్వానికి రాజకీయంగా అనుకూలమైనప్పుడు, పర్యావరణాన్ని రక్షించే స్థానిక సమాజాలకు వ్యతిరేకంగా, దాన్ని సర్వనాశనం చేసే కృత్రిమ ధోరణి పెరిగిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గత దశాబ్ద కాలంలో వ్యవహరించిన తీరు అటవీ హక్కుల చట్టం-2006 ఉల్లంఘనలకు గురవుతూ.. అటవీ విస్తీర్ణం కోల్పోతుందని సోనియా ఆరోపించారు.
‘జూన్ 2024లో, దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల నుంచి దాదాపు 65వేల వాటి కుటుంబాలను ఖాళీచేయాలని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ పిలుపునిచ్చింది’ అని ఆమె తెలిపారు. ఆశ్చర్యకరంగా, సంబంధిత మంత్రి కూడా అదే వాదనలను ప్రతిధ్వనించారు. ఇది వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 స్ఫూర్తిని ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక సమాజాలకు వ్యతిరేకంగా పర్యావరణాన్ని దెబ్బతీసిందని సోనియా పేర్కొన్నారు.