04-12-2025 01:02:42 AM
బంగ్లా మాజీ సైన్యాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఢాకా, డిసెంబర్ 3: ‘భారత్ ముక్కలు ముక్కలవ్వాలి. అప్పుడే బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొంటుంది’ అంటూ బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ ఆజ్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢాకాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత్ ఎంతో సాయం చేసిందని, ఆ సాయం మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వంతో సత్సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు భారత ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.