17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కేంద్రం శాంతి చర్చలు జరపాలి

16-06-2025 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్

ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు లను, అమాయక ఆదివాసీలను హతమారుస్తున్న కేంద్రప్రభుత్వం చేస్తున్న దామనకాండను నిలిపివేసి, శాంతి చర్చలు జరపాలని సీపీఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు.

స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని ఇందిరా పార్కు వద్ద ఈనెల 17 తేదీన చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సం దర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట జనవరి 2024 నుండి మావోయిస్టులను అణచివేసే పేరిట ప్రారంభించిన యు ద్ధం ఆదివాసులతో పాటు మావోయిస్టు లపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం మారణకాండ పట్టిందన్నారు.

రాజ్యాంగంలో పేర్కొన్న ఆదివాసులు హక్కుల్ని అణిచివేయడం జరుగు తుందని, అక్కడి ప్రకృతి వనంలో ఖనిజ సంపద స్వదేశీ విదేశీ కార్పొరేట్‌లకు ధరదత్తం చేయడం కోసమే ఈ ఎన్‌కౌంటర్లను చేపడుతుందని ఆరోపించారు. అనేక మంది మావోయిస్టులను, జాతీయ కమిటీ సభ్యు డు నంబాల కేశవరావు, అలాగే మైలాపురం ఆడేల్లు అలియాస్ భాస్కర్ అనేక మందిని పొట్ట పెట్టుకుందన్నారు. ఇటీవల కర్రె గుట ల్లో వేలాది మంది సాయిధబలగాలని చుట్టుముట్టి యుద్ధ వాతావరణం తలపిస్తుంద న్నారు.

ఈ విధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కు వ్యతిరేకంగా ఆపరేషన్ కాగార్ ను ఆపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు నళిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, పట్టణ కార్యదర్శి,అరుణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు తదితరులు పాల్గొన్నారు.