ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
17-05-2026 12:02 AM
- పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి
- పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్
హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ ఆగ్రహించారు. కేంద్రం ఇంధన ధరలు పెంచడం తో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం ప్రకటనలో పేర్కొ న్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే ధరలు పెంచారని తెలిపారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని మోదీ ప్రచారం చేశారని, ఫలితాలు వచ్చాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాకనే ఇంధన ధరలు అనేకసార్లు పెంచారని, సామన్య ప్రజల కోసం కాకుండా బడా వ్యాపార వర్గాల కోసమే పనిచేస్తోందన్నారు.






