calender_icon.png 10 August, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలు విడనాడాలి

09-08-2025 05:43:59 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ డిమాండ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వ్యతిరేక విధానాలను విడనాడాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్(CPM District Secretary Sadula Srinivas) డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబాబాద్ పట్టణం ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి అధ్యక్షతన నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్య, ఉద్యోగాలు, చట్టసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు సిపిఎం పార్టీ బీసీల అందరిని ఏకం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మించి పోరాడుతామన్నారు.

దేశంలో సకల రంగాలలో పనిచేస్తూ సంపద సృష్టిస్తున్నది  బహుజనులేనన్నారు. 1992 వరకు బీసీలకు రిజర్వేషన్ల కోటా లేదని ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లు ఫోను అగ్రవర్ణాలే అధిక సంఖ్యలో ఉద్యోగాలలో చట్టసభలలో లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలు 42 శాతం రిజర్వేషన్లు అడగడంలో తప్పేమిటి అని ప్రశ్నించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అని దుయ్యబట్టారు. వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయాలనీ, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పతనం తప్పదని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని,  బీసీల రిజర్వేషన్ల పట్ల బీజేపీ ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర  ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వంతో రాజీ  పడకుండా పోరాటం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, కుంట ఉపేందర్, సిపిఎం పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్,  వన్ టౌన్ కార్యదర్శి రావుల రాజు, పట్టణ కమిటీ సభ్యులు హేమా నాయక్ కుమ్మరి కుంట్ల నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు బొమ్మన అశోక్. గొర్రెల మేకల పంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లమ్ అశోక్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శి గౌని వెంకన్న, యమగాని వెంకన్న, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు హరి నాయక్, బానోతూ వెంకన్న, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి, డోర్నకల్ మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్, తొర్రూరు కార్యదర్శి యాకూబ్, కొరివి కార్యదర్శి మనోహర్,  కేసంద్రం కార్యదర్శి వెంకన్న,  నెల్లికుదురు కార్యదర్శి సైదులు,  పట్టణ ఏరియా కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్, తజ్జు లాలయ్య, పులుగుజు వెంకన్న, మందుల మహేందర్, ఎండి రజాక్ పాల్గొన్నారు.