calender_icon.png 9 August, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర పలకలు ఏర్పాటు చేయాలి

09-08-2025 05:46:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రభుత్వ భవనాల వివరాలు, నెలవారీ విద్యుత్ వినియోగం, బిల్లులను వారంలోగా సమర్పించాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర శాఖ భవనాలపై కూడా సౌర ఫలకాలు అమర్చనున్నట్టు ఉపముఖ్య మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, టీజీ రెడ్ కో ఎండి ఎల్. శ్రీనివాస్, ఏపిడి నాగవర్ధన్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.