16 April, 2026 | 8:26 AM

ఈపీఎస్ 95 పెన్షనర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తేవాలి

06-12-2025 12:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 5(విజయ క్రాంతి): ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్ 95 పెన్షన్ పథకంలోని అర్హులైన పెన్షన్ సభ్యులందరికీ పెన్షన్ పెంపు కోసం అదనపు పెన్షన్ నిధి చట్టాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని మజ్దూర్ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.  శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో గల మజ్దూర్ బీడీ కంపెనీలో బీడీ కార్మికులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. 

ఈ సందర్భంగా రాపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్ 9595 పెన్షన్ పథకం లోని  ముఖ్యంగా రాజీనామా చేసిన అర్హులైన బీడీ కార్మికులందరికీ 6000/ రూపాయల పెన్షన్ అమలు కోసం నెలసరి ఉద్యోగులుగా పనిచేసి రాజీనామా చేసిన వారికి 9000/ రూపాయలు పెన్షన్ అమలు కోసం అదనపు ప్రత్యేక పెన్షన్ నిధి ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వచ్చే జీఎస్టీ  మొత్తం ఆదాయం లో నుండి 1%  ఒక్కశాతం అదనపు ప్రత్యేక పెన్షన్ నిధి చట్టాన్ని  శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.