తూప్రాన్ డివిజన్‌లో రూ.36 లక్షల నగదు స్వాధీనం
తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి
తూప్రాన్, డిసెంబర్ 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యంసిసి అమలులో ఉన్న నేపథ్యంలో తూప్రాన్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన ఎఫ్ ఎస్ టి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తనిఖీలలో గతవారం రోజులలో చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్ మండలాల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న మొత్తం దాదాపు 36 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి తెలిపారు.
శుక్రవారం తూప్రాన్ ఎంపీడీవో కార్యాలయం లో ఆర్వో, ఏఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి జరగబోయే ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ భద్రత, పోలీసు బందోబస్తు, రిసీవింగ్, డిస్పాచ్ సెంటర్ల నిర్వహణ పై అవగాహన కల్పిస్తూ వివరించడం జరిగింది. ప్రశాంత వాతావరణం కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు.






