13 July, 2026 | 1:20 AM

స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి

13-07-2026 12:27 AM

కరీంనగర్ క్రైం,  జూలై 12 (విజయ క్రాంతి): స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్ యాప్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ రావణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా నేటి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని, కొత్త పరిచయాలు మరియు కొత్త స్నేహాలు సాధారణ విషయాలుగా మారినప్పటికీ, వాటి వెనుక ప్రమాదకరమైన ఉచ్చులు కూడా దాగి ఉన్నాయని పేర్కొన్నారు. స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ యాప్స్ ను వెంటనే నిషేదించాలని డిమాండ్ చేశారు.