కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన నాయకులకు షోకాజ్ నోటీసులు
గంభీరావుపేట జులై 12 (విజయ క్రాంతి )తెలంగాణ ప్రదేశ్ కమిటీ( పిసిసి ) ఇటీవల గంభీరావుపేట కాంగ్రెస్ మండల కమిటీని అధికారికంగా ప్రకటించింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నర్మాల గ్రామానికి చెందిన నిమ్మల తిరుపతి గౌడ్ ను నియమించిన నేపథ్యంలో అధ్యక్ష ప్రకటన వెలువడిన మరుసటిరోజే మండలానికి చెందిన కొందరు నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్లు జిల్లా కాంగ్రెస్ సమితి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ స్పందిస్తూ,
ఈ చర్య పార్టీ రాజ్యాంగం క్రమశిక్షణ నియమావళికి విరుద్ధంగా ప్రాథమికంగా భావిస్తున్నామని పార్టీ నిర్ణయాలను బహిరంగ వ్యతిరేకించడం వల్ల కార్యకర్తల్లో అయోమయం ఏర్పడటమే కాకుండా పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగే విధంగా ఉందని హెచ్చరించారు.మండల కాంగ్రెస్ నాయకులు గుండెల్లి రాజు,ఒరగంటి నర్సింలు,ఎలుక రాజు, గంగి స్వామి, సయ్యద్ నుశ్రత్ హుళ్ల హుస్సేన్ లపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో, షోకాజ్ నోటీస్ లు అందించారు. నోటీసులు అందిన 48 గంటల్లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీకి వివరణ ఇయ్యాలని సూచించారు. నిర్దేశిత గడువులో వివరణ అయ్యాక పోయిన రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని షోకాజ్ నోటీసులో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు.






