calender_icon.png 19 December, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బీఎల్‌వోలతో సీఈసీ భేటీ

19-12-2025 01:50:42 AM

ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్న జ్ఞానేష్‌కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ అధికారిక పర్యటనలో భాగం గా గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర బూత్‌లెవల్ అధికారులతో ( బీఎల్‌వో లు) రవీంద్రభారతి ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశా నిర్దేశం చేయనున్నారు.

అంతకు ముందే నగరంలోని చారిత్రాక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్నాయి. గురువారం హైదరాబాద్ వచ్చిన వెంటనే   సీఈసీ ఏపీలోని శ్రీశైలానికి వెళ్లారు. ఆక్కడ మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు.