19-12-2025 01:50:47 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది బిఆర్‌ఎస్ పార్టీ కి పట్టం కడుతున్నారని దీనికి పంచాయతీ ఎన్నికలు నిదర్శనమని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపిటిసి జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోటాగే మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మండలాల్లో అత్యధిక స్థానాన్ని టిఆర్‌ఎస్ కైవసం చేస్తుందని అన్నారు.
117 స్థానాల్లో 80 పైగా బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారని తెలిపారు. మా పార్టీలోనే పోటీ ఎక్కువ కావడంతో కొన్ని స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు మూడో దఫా ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలవడం గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన నూతన సర్పంచులు వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుకు చెంది ఉన్నారని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో విఫలం కావడం వల్లే టిఆర్‌ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు అందుకే అత్యధిక స్థానాన్ని బిఆర్‌ఎస్ కైవసం చేస్తుందన్నారు.
రానున్న ఎంపిటిసి జడ్పిటిసి స్థానాన్ని నాయకుల కార్యకర్తల సమన్వయంతో కైవసం చేసుకుంటామని తోట ఆగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఉపాధ్యక్షుడు ఎండి సత్తార్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు రాజన్న, ఎల్లాడిపేట అధ్యక్షుడు వలస కృష్ణ హరి, మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.