20-12-2025 12:41:16 AM
సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు
నిర్మల్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): దేశంలో మోడీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరగడం వలన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారులు ఉన్నాయని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తో కలిసి నిర్మల్ జిల్లాలో బిజెపి మద్దతు గెలిచిన సర్పంచులు ఉపసర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారిని సన్మా నం చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పి నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో అధికారులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అబద్దాలు మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడ చూడ లేదని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వారిని తమ పార్టీ అభ్యర్థులని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి పాలన గాడి తప్పిందని త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కుర్చీని లాగేందుకు ఆరోపించారు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎన్ని హామీలు గ్యారెం టీలు నెరవేర్చారు ప్రజలకు తెలుసని విమర్శించారు. ముఖ్యమంత్రి కూర్చి కాపాడేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు గాని ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు జిల్లాలకు వస్తాలేరని ధజమెత్తారు. నిర్మల్ జిల్లాలో బిజెపి సర్పంచులు విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన బిజెపి మద్దతు సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం కష్టపడి పని చేయాలని బిజెపి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అదిలాబాద్ జిల్లాలో బిజెపికి ఆదరణ లభించడం వెనుక పార్టీ నాయకులు కార్యకర్తల కష్టం ఉందని వారికి అన్ని విధాలుగా పాటి తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు
గ్రామపంచాయతీలో భారతమాతతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టా చని, రాష్ట్రంలోని ముథోల్ నియోజకవర్గం లో అత్యధికంగా బిజెపి సర్పంచులు గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తామని హామీ ఇస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు మార్పు కోరి బిజెపి సర్పంచ్లను గెలుచుకోవడం జరిగిందని దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు.
నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక స్థానాలు బిజెపి సర్పంచులు గెలుపు వెనుక ప్రతి కార్యకర్త నాయకుల కృషి ఉందని ఇదే స్ఫూర్తి రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధిస్తుందని జిల్లా అధ్యక్షులు రాథోడ్ అన్నారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి సీనియర్ నాయకులు అయ్యనార్ భూమయ్య రావుల రామనాథ్ రాజేష్ బాబు తదితరులు ఉన్నారు