9 May, 2026 | 3:35 AM

సీఎం సభను సక్సస్ చేయాలి

26-04-2024 12:00 AM

పెద్ద శంకరంపేట మండలంలోని ఉత్తులూరు, చీలపల్లి గ్రామాలకు చెంది న బీఆర్‌ఎస్ నాయకులు గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించారు. 26న (నేడు) పెద్ద శంకరంపేట్‌లో నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని, సురేశ్‌షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలు పునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా  నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.  నారాయణఖేడ్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి)