06-07-2025 12:53:21 AM
ఆదిలాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలంటే శాసనాలు, కట్టడాలే కాకుండా..పురాతన నా ణేలు సైతం ఆధారాలుగా నిలుస్తా యి. ఆ నాణేల మీద ముద్రించి ఉన్న చిహ్నాలు, కా లాన్ని బట్టి అవి ఏ రాజవంశానికి చెందినవి, ఏ రాజు వేయించాడు.
ఆర్థిక పరిస్థితులు, కా లమాన పరిస్థితులను అంచనా వేయవ చ్చు. అలాంటి ప్రాచీన చరిత్రకు అద్దంపట్టె ఎన్నో అరుదైన నాణేలను సేకరించి తన వద్ద భద్రపరుచుకున్నారు ఓ విశ్రాంత ఉద్యోగి.
ఆసక్తిగా మొదలై..
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేం ద్రానికి చెందిన బీ మురళీధర్ వ్యవసాయ శాఖలో విస్తరణ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన జిల్లాలో పేరు న్న రచయిత. తాను రాసిన పలు కథలకు, నవలకు పురస్కారాలను సైతం అందుకున్నారు.
తొలిసారి హైదరాబాద్‌లో ఓ నాణేల ప్రదర్శనను తిలకించిన ఆయన నాణేల సేకరణపై ఆసక్తిని పెంచుకున్నారు. అప్పటి నుంచి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రవృత్తిగా పురాతన నాణేలను సేకరించడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వందకుపైగా ప్రాచీన నాణేలను సేకరించి భద్రపరిచారు.
నాణేల ప్రదర్శనకు విశేష స్పందన
ఇటీవల ఆదిలాబాద్‌లోని కళాశ్రమంలో నిర్వహించిన నాణేల ప్రదర్శనకు విశేష స్పం దన లభించింది. దాదాపు 130 నాణేలను ప్రదర్శనలో ఉంచారు. భారత్‌ను పాలించిన ప్రాచీన రాజవంశాలు, చక్రవర్తులకు సంబంధించిన నాణేలు, జపాన్‌కు సంబంధించిన నాణేలు సైతం ఇందులో ప్రదర్శించారు.
ఎందరో రాజుల నాణేలు..
క్రీ. పూ. 600 సంవత్సరాల నుంచి క్రీ.శ 1వ శతాబ్దం వరకు పాలించిన రాజవంశాలకు చెందిన నాణేలు మురళీధర్ వద్ద ఉన్నా యి. కనిష్కుడు, విష్ణుకుండినులు, బహమనీ సుల్తానులు, మొఘలుల కాలం నాటి ప్రాచీ న నాణేలు సైతం ఆయన సేకరించిన వాటిలో ఉన్నాయి. మరికొన్ని పంచ్ మార్క్ నాణేలను సైతం సేకరించారు.
30 ఏళ్లుగా సేకరిస్తున్నా..
ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే 30 ఏళ్ల క్రితం ఈ పురాతన నాణేల సేకరణ మొదలుపెట్టాను. పురాతనమైన పంచ్ మార్క్ నాణేలను హైదరాబాద్‌లో కొనుగోలు చేశా. విష్ణుకుండినులు, బహమనీ సుల్తానుల కాలానికి సంబంధించిన నాణేలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించా. నావద్ద ఉన్న ప్రాచీన నాణేల్లో 90 శాతం నాణేలు ఆదిలాబాద్ ప్రాంతంలోనే లభించాయి. నాటి చరిత్రను ఈ నాణేల ద్వారా భావితరానికి అందజేయలన్నదే నా సంకల్పం.
మురళీధర్, రచయిత, నాణేల సేకరణ కర్త