13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీరామాలయంలో కలెక్టర్ దంపతులు

28-03-2026 12:32 AM

హనుమకొండ, మార్చి 2౭ (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలో భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పిడీసీఎల్ సిఎండీ వరుణ్ రెడ్డి దంపతులు రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేదమంత్రాల నడుమ నిర్వహించిన ఈ పూజల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు, ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీరామనవమి పండుగ మనకు ధర్మం, న్యాయం, సత్యనిష్ఠ వంటి విలువలను గుర్తుచేస్తుందని అన్నారు.  ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు  చేశారు.స్వచ్ఛత, భద్రత, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించారు.