13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రామాలయం చారిత్రాత్మకం

28-03-2026 12:31 AM
  1. పార్టీలకు అతీతంగా  అభివృద్ధి 

త్వరలోనే ఆలయ పరిధిలోకి రాములవారి భూములు 

మరో  రూ.కోటి నిధుల మంజూరు 

జిల్లాలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం 

పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కవిత దంపతులు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): చారిత్రాత్మక రామాలయాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఖింద్రంలోని రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రోడ్డు సౌకర్యం కల్పించామని, రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు.

మరిన్ని నిధులు.. త్వరలోనే నూతన కళ్యాణ మండపం

ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులతో మాట్లాడి మరో కోటి రూపాయల నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే శ్రీరామనవమి వేడుకలను కొత్తగా నిర్మించబోయే కళ్యాణ మండపంలోనే నిర్వహించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తామని, అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యేకు పిలుపు.. కవిత హాజరు

స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, భక్తి భావంతో ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.

ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దంపతులు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, రామరాజ్య స్థాపన లక్ష్యంగా అందరూ ఐకమత్యంతో మెదలాలని కోరారు.

జిల్లావ్యాప్తంగా మిన్నంటిన రామనవమి వేడుకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన ఆలయాలైన బడా రామ్ మందిర్, బోధన్, సారంగాపూర్, ఈఆర్పీ క్యాంప్, ఆర్మూర్, బాల్కొండ, డిచ్పల్లి, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, గాంధారి ప్రాంతాల్లోని రామాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాలు జరిగాయి.

శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పలుచోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. భక్తులకు భారీగా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.  ఇంటింటా పండుగగా జిల్లాలోని హిందూ బంధువులు తమ ఇళ్ల వద్ద పందిళ్లు వేసి, సీతారాముల చిత్రపటాలకు పూజలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు.