గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
01-05-2026 12:45 AM
పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్, పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ గారు, టేకుమట్ల గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి గారు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






