సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
11-06-2024 12:05 AM
మంచిర్యాల, జూన్ 10 (విజయక్రాంతి) : భవన నిర్మాణ కార్మికు సమస్యలు పరిష్కరించాలని సోమవారం సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల రామన్న ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. 50 ఏండ్లు నిండిన కార్మికుడికి పెన్షన్, ప్రమాద బీమా కింద రూ. 15 లక్షలు ఎక్‌రరగేషియా ఇవ్వాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న క్లుమ్సై విడుదల చేయాలని, పనిముట్ల కొనుగోళ్లకు రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల చిట్టాను వినతిపత్రం ద్వారా అదనపు కలెక్టర్ రాహుల్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల సదానందం, జిల్లా కోశాధికారి చెడి అశోక్, దోరిశెట్టి శ్రీనివాస్, వెంగళ గణేష్, ఆనం అశోక్, గుండా లచ్చన్న, మల్క చంద్రయ్య, చింతల మల్లేష్, తన్నీరు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






