కాంగ్రెస్, విపక్ష పార్టీలకు బుద్ధిచెప్పాలి
- మహిళా బిల్లును అడ్డుకున్న హస్తం పార్టీ
- ఏప్రిల్ 17 దేశ చరిత్రలో చీకటి రోజు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- మహిళాబిల్లు ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి: మంత్రి బండి సంజయ్
- బీజేపీకి, మోదీకి క్రెడిట్ వస్తుందనే అడ్డగింత: ఎంపీ డీకే అరుణ
- రాజకీయ పబ్బం గుడుపుకొంటున్న కాంగ్రెస్: ఎంపీ లక్ష్మణ్
- దమ్ము, ధైర్యమున్న ప్రధాని మోదీ : ఎంపీ ఈటల
- ఆ పార్టీలు 70కోట్ల మహిళలను మోసం చేశాయి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, విపక్ష పార్టీలకు బుద్ధిచెప్పాలని, ప్రధాని నరేంద్ర మోదీ హయాం లోనే మహిళాబిల్లు సాధ్యమని, ఇందుకోసం దేశంలోని మహిళలంతా ఏకతాటిపైకి రావావాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ కొమురయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ నీచ రాజకీయాలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నగరంలోని జీహెచ్ ఎంసీ కార్యాలయం నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు జన్ ఆక్రోశ్ యాత్ర పేరు తో భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ తోపాటు ఇండి కూటమి కపటబుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ అనంతరం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన ఏప్రిల్ 17 దేశ చరిత్రలో చీకటి రోజని ఆయన పేర్కొన్నారు.
చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రధాని మోదీ తీసుకొస్తే ఆ బిల్లును అడ్డుకొని కాంగ్రె స్ నేతలు పార్లమెంటు లోపల బయట సంబరాలు చేసుకోవడం మహిళా వ్యతిరేక వైఖరికి నిదదర్శనమన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మహిళలను సామాజికంగా రాజకీయంగా వెనక్కి నెట్టాలని చూస్తు న్న కాంగ్రెస్ కుట్రలను నారీలోకం గనమిస్తోందన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మహిళాబిల్లు ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి అని, మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని మహిళలకు పిలుపునిచ్చారు. మ హిళాబిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని, సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ కూటమి నేతలపై ఆయన ధ్వజమెత్తారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంటులో మహిళాబిల్లు ఆమోదం పొందితే బీజేపీకి, ప్రధాని మోదీకి క్రెడిట్ వస్తుందనే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయ ని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియ అడ్డుకునేందుకు ఉత్తర భారత్, దక్షిణ భారత్ అని తేడాలు తీసుకొచ్చి కాంగ్రెస్, అనుబంధ పార్టీలు రాజకీ య పబ్బం గుడుపుకుంటున్నాయని ఆరోపించారు. ఎంపీ ఈటల రా జేందర్ హట్లాడు తూ మహిళలను పూజించడం, గౌరవించ డం మన ధర్మమన్నారు. ఈ దేశంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పార్లమెంటులో మహిళాబిల్లును కాంగ్రెస్‌తోపాటు అనుబంధపార్టీలు అడ్డుకొని, దేశంలో ఉన్న 70కోట్ల మహిళలను మోసం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని ఆగ్రహింలన్నారు. రాబో యే రోజుల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన స్టాలిన్, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భరత్‌గౌడ్, లంకలదీపక్‌రెడ్డి, మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు.






