calender_icon.png 1 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనంపల్లి హనుమంతరావును గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ నేతలు

01-11-2025 06:44:58 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మైనంపల్లి హను మంతరావు తన కుమారుడైన రోహిత్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీగా నాచారం దేవస్థానానికి పూజా నిమిత్తం వెళ్ళినారు. ఇదే క్రమంలో తూప్రాన్ మండలంలోని ఘనపూర్ చౌరస్తాలో మాజీ ఎంపీపీ గడ్డి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు మరియు ఆయనను గజమాలతో సత్కరించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేసుకుని నోరు తీపి చేసుకున్నారు. ఇందులో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి దంపతులు, సబ్బని వెంకటేష్, ఘనపూర్ కాంగ్రెస్ నాయకులు, జావిద్ పాషా, నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేశారు.