18 April, 2026 | 2:49 PM

మరోసారి భద్రాద్రి వాసుల ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్ ప్రభుత్వం

07-04-2025 12:00 AM

రామాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారనే ఆశ నిరాశైంది

చివరికి శంకుస్థాపన చేయకుండా, ఏ హామీ ఇవ్వకుండా వెనుదిరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

భద్రాచలం, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) భద్రాద్రి అభివృద్ధికి గత ప్రభుత్వం అవలంబించిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నదా అన్న సందేహం భద్రాచలం వాసులకు రామ భక్తులకు కలుగుతున్నది. ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు భద్రాద్రి అభివృద్ధికి వంద కోట్లు ఇస్తానని హామీ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో సైతం పెట్టి ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడంతో భద్రాద్రి వాసుల్లో బి ఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం,  అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్న బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు దేవాలయం ఆవరణలో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన భద్రాద్రి రామాలయంను తమ ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరుతుందని వెల్లడించారు. దీంతో యాదగిరిగుట్ట మాదిరిగానే భద్రాచలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే భావనతో ఈ ప్రాంత ప్రజలలో, రామ భక్తులు ఎదురుచూస్తున్నారు.
























































































































అయితే తొమ్మిది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం తో పాటు కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి భద్రాచలం వస్తున్నారని తెలియడంతో కచ్చితంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రి కేవలం తన పర్యటన కళ్యాణం వరకే పరిమితం చేసుకొని  వెళ్లిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు రామభక్తులు తీవ్ర నిరాశ నిష్పలకు లోనైనారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఈ ప్రభుత్వం అయినా భద్రాద్రి రామయ్య పై ప్రేమ చూపుతుందని  భావించినప్పటికీ శ్రీరామనవమి నాడు ఫలితం కనిపించలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాకు ఉన్న ముగ్గురు మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రామాలయం అభివృద్ధికి మీరు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజానీకం రామభక్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు