గుండెపోటుతో సీపీఎం నేత యర్రా శ్రీకాంత్ మృతి
ఖమ్మం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి ): సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ (62 ) ఆదివారం తీవ్రమైన గుండెపోటుతో మధురైలో మర ణించారు. పార్టీ అఖిల భారత మహాసభలలో పాల్గొనేందుకు ప్రతినిధిగా వెళ్ళిన శ్రీకాంత్ శనివారం అస్వస్థతకు గురి కావడంతో మధురైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆది వారం తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు.
శ్రీకాంత్కు భార్య, ముగ్గురు కుమారు లు ఉన్నారు. శ్రీకాంత్ ఖమ్మం పట్టణంలో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలో ఎస్.ఎఫ్.ఐ. వైపు ఆకర్షితుడై విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకుగా పాల్గొని కీలక పాత్ర పోషించారు. గత 37 సం.లుగా కార్మికోద్యమంలో పనిచేస్తూ అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.శ్రీకాంత్ మరణం పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు తెలిపారు.






