calender_icon.png 29 July, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగభూపాలెం ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

29-07-2025 01:32:44 AM

  1. సింగభూపాలెం ప్రాజెక్టు కంగుబాటు గురైన ప్రాంతాన్ని సందర్శించిన సిపిఎం బృందం సిపిఎం
  2. జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్, జూలై 28 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సుజాతనగర్ లోని సింగ భూపాలెం ప్రాజెక్టుకుశాశ్వత పరిష్కారం ఎప్పుడు చేపడుతారని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సోమవారం సిపిఎం బృందం సింగభూపాలెం ప్రాజెక్టు కుంగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిం గభూపాలెం ప్రాజెక్టు 1936 లో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని 2,600 ఎకరాలకు సాగు నీరు అందే విధంగా నాటి కాక తీయుల కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్టు వాగున్న చోట నిర్మాణం చేసి 1986లో అమరజీవి కాసాని ఐలయ్య గారి నాయకత్వంలో కట్ట కుంగుబాటు గురైనచోట ప్రజల సహకారంతో ఆధ్వర్యంలో కుంగుబాటు గురైన చోట సిమెంట్ కట్టలు వేసి అక్కడ పార్టీ ఆధ్వర్యంలోని చెరువుకట్ట కాపాడుకున్నారని గుర్తు చేశారు. గత మూడు సంవ త్సరాలుగా లూజు సాయిలు ఉన్నచోట బలహీనమైన భూమి ఉన్నచోట వాగు ప్రవహించే ప్రాంతంలో ఎదురుగా ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని అనేక సందర్భాల్లో అధికారులు చెప్పినప్పటికీ మీనమేషాలు లెక్క గడుతు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని ఆయన మూడు సంవత్సరాల క్రితమే పోరా టం చేశారన్నారు.

చెరువు కట్ట మరమ్మత్తు చేయలేక అలుగును బాంబులతో కూల్చివేసి చివరి భూముల నీళ్లు అందకుండా చేశారని మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా ఎక్కడైతే చె రువు కట్ట బలహీనంగా ఉండి కుంగుబాటు గురవుతుందో అక్కడ నీళ్లు లేనప్పుడు వేసవికాలంలోనే ప్రొటెక్షన్ వాల్ ని ర్మించి దీని శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

పర్యాటక కేంద్రం చేయాలని అధికారులు, రాష్ట్ర ప్రభు త్వం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ప్రకటిస్తున్నారని,పర్యాటక కేంద్రం కాదు దీనికి శాశ్వత పరిష్కారం చూపి చివరి భూములకు నీళ్లు అందే విధంగా ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని, లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కు న్సోత్ ధర్మ, సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్, కాట్రాల తిరుపతిరావు, గండమాల భాస్కర్, బచ్చలకూర శ్రీనివాస్, నర్రా శివరామకృష్ణ, చింతల శ్రీను, నల్లగొపు పుల్లయ్య, బాలు వెంకటేశ్వర్లు, బాణోత్ జ్యోదిరాం, కోలాహలం శ్రీధర్ రాజు, కొమరరెడ్డి, కసనబోయిన గంగయ్య,బాబా, పాపారావు, సట్టు నరసింహారావు, నల్లగొర్ల వేణు, పగడాల లక్ష్మణ్,నాగ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.