1 July, 2026 | 7:26 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

21-03-2026 12:00 AM

బీజేపీ నాయకుల డిమాండ్ 

మున్సిపల్ కార్యాలయం 

ఎదుట ధర్నా 

బిజెపి జిల్లా అధ్యక్షుడు 

నీలం చిన్న రాజులు 

కామారెడ్డి, మార్చి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై ఉద్యమం చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.

బిసి, ఎస్ సి ఎస్ టి, మైనార్టీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజు రియాంబర్స్ మెంట్ సకాలంలో ప్రభుత్వం మంజూరు చేయటం లేదని అన్నారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, అర్హులైన వృద్ధులు, వికలాంగులకి, వితంతువులకు పింఛన్లు చెల్లించాలని అన్నారు, ఇల్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో గత సోమవారం అన్ని మండల కార్యాలయాలలో ధర్నా నిర్వహించి నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని అందుకు నిరసనగా ధర్నా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడి చేస్తామని అన్నారు. రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు  నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఉద్యమం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాం బిజెపి అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, నరేందర్ రెడ్డి, బిజెపి కౌన్సిలర్ లు మధు, తోట వంశీ కృష్ణ, కుంట లక్ష్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆకుల భరత్, రాజు పాటిల్, తదితరులు పాల్గొన్నారు.